
రాజకీయాలు

హైదరాబాద్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు పనులను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను సమీక్షించిన వారు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి నిర్మాణం, ప్రతి నిర్ణయం ఉంటుందని మంత్రులు పేర్కొన్నారు. లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్‌తో పాటు పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!