

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గురువారం రికార్డు స్థాయిలో 20,003 మెగావాట్లకు చేరిందని రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక డిమాండ్ అని పేర్కొన్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసినట్లు వెల్లడించారు. గురువారం జెన్కో సీఎండీ డాక్టర్ హరీశ్తో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించిన ఆయన, బొగ్గు నిర్వహణ విభాగంలోని సమస్యలను బీహెచ్ఈఎల్ సీనియర్ ఇంజినీర్లతో సమీక్షించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్లోని నాలుగు యూనిట్ల ద్వారా తొలిసారిగా 2,109 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి నమోదైందని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ఐదో యూనిట్ను ఈ వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం యూనిట్ సింక్రొనైజేషన్ ప్రక్రియను చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!