
జనరల్

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ వాట్సాప్ మరియు చాట్బాట్ ప్లాట్ఫామ్లో మరిన్ని GHMC పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటీ & కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఈ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవల్లో ప్రాపర్టీ అసెస్మెంట్ రివిజన్, జనన–మరణ సర్టిఫికెట్ సవరణలు, ఇంటి వద్ద జనన–మరణ నమోదు, డోర్ నంబర్ సవరణ, ప్రాపర్టీ పేరు మార్పు, ప్రాపర్టీ ట్యాక్స్ సేవలు, ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ వంటి సేవలు ఉన్నాయి. ప్రజలు 8096958096 నంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఈ సేవలను సులభంగా పొందవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!