23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

Writer: Pooja 06:37 AM, 23 అక్టోబర్, 2026
ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ‘సూపర్‌ ఎల్‌నినో’ పరిస్థితులు ఎదురైనా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. వ్యవసాయ, గృహ అవసరాలకు సరిపడా విద్యుత్‌ అందించేందుకు జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో రోజుకు 140 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, బకాయిలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సగటున 91 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, ఈ నెల 16న ఒక్కరోజులో 118 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో సీఎండీ ఎస్‌. హరీశ్‌ వివరించారు. రోజువారీ ఉత్పత్తిని 140 మిలియన్‌ యూనిట్లకు పెంచాలని భట్టి సూచించారు.

యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్‌ ఇండియా నుంచి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల నుంచి బొగ్గు సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కేంద్రంలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఇప్పటికే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయని, ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌కు అనుసంధానించినట్లు వివరించారు. మిగిలిన సాంకేతిక, నిర్వహణ సమస్యలను పరిష్కరించి త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు, మూతపడిన పరిశ్రమల విద్యుత్‌ బకాయిల వసూళ్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని భట్టి ఆదేశించారు. అర్హత కలిగిన పరిశ్రమలకు చెల్లింపుల్లో వెసులుబాటు కల్పించడంతో పాటు, పంపిణీ సంస్థలకు దీర్ఘకాలిక బకాయిల వసూళ్లు జరిగేలా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సింగరేణి, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్‌, జెన్‌కో సీఎండీ హరీశ్‌, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌, రైతు డిస్కమ్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌, సింగరేణి డైరెక్టర్‌ గౌతం పొట్రు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు ఆచరణలోనే అసలైన వివేకం

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

నీటి కేటాయింపుల్లో జాప్యం..కృష్ణా బోర్డు తీరుపై అసంతృప్తి

ట్యాగ్లు
తెలంగాణ విద్యుత్భట్టి విక్రమార్కఎల్‌నినో ప్రభావంథర్మల్ విద్యుత్ ఉత్పత్తియాదాద్రి విద్యుత్ కేంద్రంవిద్యుత్ బకాయిలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..ప్రభాస్ బర్త్‌డే కానుకగా ‘ఫౌజీ’ పోస్టర్ విడుదల!
సినిమాలు

డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్..ప్రభాస్ బర్త్‌డే కానుకగా ‘ఫౌజీ’ పోస్టర్ విడుదల!

అనిరుధ్ నవరాత్రి వేడుకల్లో తమిళ సినీ తారల సందడి
సినిమాలు

అనిరుధ్ నవరాత్రి వేడుకల్లో తమిళ సినీ తారల సందడి

కాణిపాకం వినాయకుడి హుండీకి భారీ ఆదాయం
జనరల్

కాణిపాకం వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

టిబెట్‌లో భారీ భూకంపం
జనరల్

టిబెట్‌లో భారీ భూకంపం

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్..అభిమానుల గుండెల్లో ఎప్పటికీ డార్లింగ్!
సినిమాలు

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్..అభిమానుల గుండెల్లో ఎప్పటికీ డార్లింగ్!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ

థియేటర్లలో నిరాశ..డిజిటల్ విడుదలతో ‘డొరోథీ’కి కొత్త ఆశలు
ఓటీటీ

థియేటర్లలో నిరాశ..డిజిటల్ విడుదలతో ‘డొరోథీ’కి కొత్త ఆశలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు - డీజీపీ హెచ్చరిక

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర
జనరల్

ప్రధాని మోదీ దర్శనంతో వెలుగులోకి వచ్చిన జలకంఠేశ్వర ఆలయ చరిత్ర

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
జనరల్

ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్
బిజినెస్

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల..వెండి ధర కూడా డౌన్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క
జనరల్

ఎల్‌నినో ప్రభావం ఉన్నా విద్యుత్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి - భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!