
రాజకీయాలు

ఇద్దరు యువతీ యువకుల మధ్య ఏర్పడిన సంబంధం వివాహానికి దారి తీయకపోతే, దాన్ని మోసం అని భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేస్తానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించాడన్న కారణంతో గాజుల తిరుపతి అనే అభ్యర్థిని పోలీసు ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించిన తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వివాహానికి ముందు సంబంధాలు సాధారణమని, పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధాన్ని మోసం అని చెప్పలేమని ధర్మాసనం పేర్కొంది. ఆరోపణలు రుజువు కాకుండా ఉద్యోగాన్ని నిరాకరించడం ఏకపక్షమని తేల్చింది. అభ్యర్థికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!