

కడప జిల్లా బద్వేల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాను పోలీసులు అరెస్ట్ చేసి అట్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలువురు జిల్లా వైసీపీ నేతలు అట్లూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టు విషయం తెలియడంతో బద్వేల్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు బద్వేల్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇరు పార్టీల కార్యకర్తలను అదుపు చేసేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే అరెస్టుకు దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో బద్వేల్‌లో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!