Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైకుంఠ ద్వార దర్శనాల పై నేడు టీటీడీ అధికారుల తో మంత్రుల కీలక రివ్యూ

09:20 AM, 22 డిసెంబర్, 2025
వైకుంఠ ద్వార దర్శనాల పై నేడు టీటీడీ అధికారుల తో మంత్రుల  కీలక రివ్యూ

తిరుమలలో కొలువుదీరిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. ముక్కోటి ఏకాదశి సమయం వచ్చేసరికి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముక్కోటి ఏకాదశికి సంబంధించి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల పై సోమవారం తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరుకానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగంతో కలిసి భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల పై మంత్రులు సమీక్షించనున్నారు.

డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి మూడు రోజుల దర్శనాల కోసం ఈ-డిప్ విధానంలో టోకెన్లు కేటాయించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ మొత్తం 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

మొదటి మూడు రోజుల తర్వాత మిగిలిన ఏడు రోజుల్లో ఎటువంటి టోకెన్లు లేకుండానే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్నప్రసాద వితరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ నిర్వహణ వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

గతేడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పడిన రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, ఈసారి అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, టీటీడీ ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అధిక విద్యార్హత న్యాయమైన నియామక ప్రక్రియను ప్రభావితం చేస్తుందని సుప్రీం తీర్పు

ఘటన అనంతరం మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం లేదని హెచ్ఎంఆర్‌ఎల్ వివరణ

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనం

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై తమిళనాడు సర్కార్ కఠిన చర్యలు..

ట్యాగ్లు
ముక్కోటి ఏకాదశివైకుంఠ ద్వార దర్శనంతిరుమలశ్రీ వెంకటేశ్వర స్వామి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పన్ను చర్చ
క్రీడలు

ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పన్ను చర్చ

భారత సినీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌గా ధురంధర్ - అంబానీ
సినిమాలు

భారత సినీ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌గా ధురంధర్ - అంబానీ

అధిక విద్యార్హత న్యాయమైన నియామక ప్రక్రియను ప్రభావితం చేస్తుందని సుప్రీం తీర్పు
జనరల్

అధిక విద్యార్హత న్యాయమైన నియామక ప్రక్రియను ప్రభావితం చేస్తుందని సుప్రీం తీర్పు

ఘటన అనంతరం మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం లేదని హెచ్ఎంఆర్‌ఎల్ వివరణ
జనరల్

ఘటన అనంతరం మెట్రో పిల్లర్లకు ఎలాంటి నష్టం లేదని హెచ్ఎంఆర్‌ఎల్ వివరణ

లలిత్ మోడీ విలాస జీవనశైలిని సమర్థిస్తూ ఆరోపణలను కొట్టిపారేశారు
బిజినెస్

లలిత్ మోడీ విలాస జీవనశైలిని సమర్థిస్తూ ఆరోపణలను కొట్టిపారేశారు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాజకీయాలు

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు
జనరల్

యూట్యూబర్ రమానందన, మధుకర్‌పై LOC జారీ.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు
ఆరోగ్యం

ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. వైద్యుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ
రాజకీయాలు

పార్లమెంట్‌లోకి డీలిమిటేషన్ బిల్లు.. స్టాలిన్ వైఖరిపై జాతీయ స్థాయిలో చర్చ

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల పొడిగింపుకు ఆదేశాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు
సినిమాలు

విడుదలకు ముందే సెన్సేషన్.. కర్ణాటకలో ‘పెద్ది’కి భారీ వసూళ్లు

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. కొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!