
జనరల్

తెలంగాణ ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవసరమైతే ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విక్రయించి బకాయిలు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నాయకులు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి విజేతలను సత్కరించారు. ఉద్యోగులకు సంబంధించిన సీసీఎస్ బకాయిలతోపాటు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!