23, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

Writer: Shivani K 04:48 PM, 23 అక్టోబర్, 2026
తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఊరట కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా దర్శనం, వసతి కోసం ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు తదితరుల సిఫార్సు లేఖలను స్వీకరించడంపై ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వచ్చే భక్తులు నిరాశకు గురికాకుండా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీటీడీని కోరారు. సిఫార్సు లేఖల ఆధారంగా ఉచిత దర్శనం లేదా ఇతర ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం సాధ్యం కాని పరిస్థితుల్లో, కనీసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రాల వారీగా టికెట్ల కోటా కేటాయించడం లేదా పారదర్శకమైన ఆన్‌లైన్ విధానంలో టికెట్లు అందుబాటులో ఉంచడం వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని దుండ్ర కుమారస్వామి సూచించారు. ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా ప్రముఖులకు కల్పించే సౌకర్యాలకు భిన్నంగా సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే భావన కలగకుండా చూడాలని అన్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించి, టీటీడీ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, టీటీడీ నిబంధనలకు అనుగుణంగా టికెట్ల కేటాయింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి భక్తులకు దర్శనాన్ని మరింత సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు

అమితాబ్ బచ్చన్ బంగ్లాకు బెదిరింపులపై పోలీసుల విచారణ

అరుణాచల్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య కొనసాగుతున్న ముఖాముఖి.. ఐటీబీపీ చీఫ్ వెల్లడి

వ్యాపారవేత్త మెటా గ్లాసెస్‌పై అనుమానం.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సూచన

ట్యాగ్లు
తిరుమలశ్రీవారి దర్శనందుండ్ర కుమారస్వామిటీటీడీరూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంచంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్ఎన్నికల ప్రవర్తనా నియమావళిభక్తుల సౌకర్యాలుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఆర్‌ఆర్ ప్రొడక్షన్స్ తొలి సినిమా ప్రారంభం.. దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం
సినిమాలు

హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంది.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంది.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి
జనరల్

తిరుమల దర్శన టికెట్లపై పునరాలోచించాలి.. టీటీడీకి బీసీ నేత విజ్ఞప్తి

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం
జనరల్

అమెరికాలో తెలుగు యువతి అక్షిత హఠాన్మరణం

భారీ సైబర్‌ భద్రతా లోపం.. గ్లోబల్ SSL/TLS సర్టిఫికెట్ వ్యాపారాన్ని నిలిపివేయనున్న eMudhra
టెక్నాలజీ

భారీ సైబర్‌ భద్రతా లోపం.. గ్లోబల్ SSL/TLS సర్టిఫికెట్ వ్యాపారాన్ని నిలిపివేయనున్న eMudhra

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు
జనరల్

తల్లిపై ప్రేమతో అసాధారణ యాత్ర చేపట్టిన యువకుడు

సంక్లిష్ట వ్యాధుల నిర్ధారణలో వైద్యుల కంటే రెండింతలకుపైగా కచ్చితత్వం.. మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యవస్థ

‘జైలర్ 2’పై బన్నీ ప్రశంసలు.. మళ్లీ మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్
సినిమాలు

‘జైలర్ 2’పై బన్నీ ప్రశంసలు.. మళ్లీ మొదలైన మెగా, అల్లు ఫ్యాన్స్ వార్

అమితాబ్ బచ్చన్ బంగ్లాకు బెదిరింపులపై పోలీసుల విచారణ
జనరల్

అమితాబ్ బచ్చన్ బంగ్లాకు బెదిరింపులపై పోలీసుల విచారణ

అరుణాచల్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య కొనసాగుతున్న ముఖాముఖి.. ఐటీబీపీ చీఫ్ వెల్లడి
జనరల్

అరుణాచల్ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య కొనసాగుతున్న ముఖాముఖి.. ఐటీబీపీ చీఫ్ వెల్లడి

వ్యాపారవేత్త మెటా గ్లాసెస్‌పై అనుమానం.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
జనరల్

వ్యాపారవేత్త మెటా గ్లాసెస్‌పై అనుమానం.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సూచన
జనరల్

ఏపీ ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని సూచన

అక్షయ్ కుమార్ ప్రశంసలు అందుకున్న అమిత్ షా
జనరల్

అక్షయ్ కుమార్ ప్రశంసలు అందుకున్న అమిత్ షా

మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం
బిజినెస్

మధ్యతరగతికి పన్ను ఊరట.. మోదీ సర్కారు కీలక నిర్ణయం

పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు కోరిన కాంగ్రెస్.. సీపీఐ నేతలతో సమావేశం
రాజకీయాలు

పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతు కోరిన కాంగ్రెస్.. సీపీఐ నేతలతో సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!