

విదేశాల్లో స్థిరపడినా మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బతుకమ్మ, బోనాల వంటి పండుగలను స్విట్జర్లాండ్‌లో నిర్వహిస్తూ తెలుగు భాషా సంస్కృతిని భావితరాలకు అందించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం గురువారం స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్ ఆవిష్కరించారు.
స్విట్జర్లాండ్‌లో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయం గురించి తెలుగు సంఘం ప్రతినిధులు బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్ వేదాంతం, కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రతినిధుల బృందం బెర్న్‌లోని చారిత్రక పార్లమెంట్ భవనాన్ని సందర్శించింది. స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అక్కడి ప్రతినిధులతో చర్చించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!