26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

Writer: Shivani K 05:50 AM, 26 అక్టోబర్, 2026
ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

యుద్ధాల ద్వారా దేశాలను బలహీనపరిచే పరిస్థితుల కంటే, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసి నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి సవాళ్లను అధిగమిస్తూ భారత్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌ సమీపంలో జట్నీ ఇన్ఫోవ్యాలీ-2 పరిధిలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో రూ.169 కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ డేటా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1960–70 దశకాల్లో బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ, బ్యాంకింగ్‌ సేవలు పేదలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. అప్పట్లో పేదరిక నిర్మూలన నినాదానికే పరిమితమైందని వ్యాఖ్యానించారు. 2014 తర్వాత బ్యాంకింగ్‌ రంగంలో సమగ్ర మార్పులు చోటుచేసుకున్నాయని, డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ గణనీయంగా బలోపేతమైందని తెలిపారు.

ముద్ర, జన్‌ధన్‌, అటల్‌ పింఛన్‌ వంటి పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, స్వయం సహాయక సంఘాలకు కలిగిన ప్రయోజనాలను ప్రధాని వివరించారు. ప్రస్తుతం ఇంటింటికీ బ్యాంకింగ్‌ సేవలు చేరువయ్యాయని పేర్కొన్నారు. అదే సమయంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థలో భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చెందిన రెండో సైబర్‌ శిక్షణ, డేటా కేంద్రాన్ని ఒడిశాలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి జుయల్‌ ఓరం, గవర్నర్‌ బ్రజ్‌ మోహన్‌ ప్రసాద్‌, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. రైతులు రెండో పంట వేయొద్దు: పొంగులేటి

కొరియా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధం.. కీలక రంగాలపై దృష్టి

దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

నగరాల పాలనలో కీలక మార్పులు.. ‘మేయర్‌ ఇన్‌ కౌన్సిల్‌’ విధానం తేవాలి: రాజీవ్‌ గాబా

ట్యాగ్లు
నరేంద్ర మోదీఒడిశాఆర్‌బీఐ డేటా కేంద్రండిజిటల్ బ్యాంకింగ్భారత ఆర్థిక వ్యవస్థసైబర్ భద్రతజన్‌ధన్ యోజనముద్ర పథకంనిర్మలా సీతారామన్బ్యాంకింగ్ రంగం
AdvertisementAdvertisement
ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ఆర్టీసీ టెర్మినళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

భారతీయ వంటకళకు విశేష సేవలు.. ప్రముఖ చెఫ్‌ దాము మృతి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్షణికావేశంలో తొందరపడ్డా.. తప్పును సరిదిద్దుకుంటా: జక్కంపూడి రాజా
రాజకీయాలు

గగనతల రక్షణకు మరింత బలం.. ఐఏఎఫ్‌ భవిష్యత్‌ ప్రణాళికపై ఏపీ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యానికి స్థానిక ఉత్పత్తులే బలం.. మోదీ సూచన

తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

తెలంగాణను ఏటీఎంగా మార్చారు.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. రైతులు రెండో పంట వేయొద్దు: పొంగులేటి
జనరల్

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. రైతులు రెండో పంట వేయొద్దు: పొంగులేటి

కొరియా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధం.. కీలక రంగాలపై దృష్టి
జనరల్

కొరియా సంస్థలతో భాగస్వామ్యానికి తెలంగాణ సిద్ధం.. కీలక రంగాలపై దృష్టి

దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి
జనరల్

దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి

నగరాల పాలనలో కీలక మార్పులు.. ‘మేయర్‌ ఇన్‌ కౌన్సిల్‌’ విధానం తేవాలి: రాజీవ్‌ గాబా
జనరల్

నగరాల పాలనలో కీలక మార్పులు.. ‘మేయర్‌ ఇన్‌ కౌన్సిల్‌’ విధానం తేవాలి: రాజీవ్‌ గాబా

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ఆర్టీసీ టెర్మినళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ఆర్టీసీ టెర్మినళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

భారతీయ వంటకళకు విశేష సేవలు.. ప్రముఖ చెఫ్‌ దాము మృతి
జనరల్

భారతీయ వంటకళకు విశేష సేవలు.. ప్రముఖ చెఫ్‌ దాము మృతి

కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌
జనరల్

కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌

ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!