

వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, కడపలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ర్యాలీలు నిర్వహించవద్దని, కార్యకర్తలను గుంపులుగా ఉంచవద్దని నోటీసుల్లో సూచించినట్లు సమాచారం.
కమలాపురం నగర పంచాయతీలో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేత నరేన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కమలాపురం నుంచి కడపకు తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ మద్దతుదారులు నామినేషన్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!