
క్రీడలు

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు పరిశీలించి తమకు నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకునేందుకు పలు కార్లను అక్కడ ప్రదర్శించారు. అధికారిక కార్యక్రమాలు, నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ ఖర్చుతో కార్లు అందిస్తామని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు.
తుది ఎంపికకు ముందు అందుబాటులో ఉన్న కార్ల మోడళ్లను ఎమ్మెల్యేలు పరిశీలించి, వాటిలో తమకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు ప్రభుత్వ నిధులతో కార్లతో పాటు అదనపు నెలవారీ భత్యాలు కూడా అందనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!