15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దివ్యాంగులకు కేంద్రం మరింత ఆసరా

Writer: Chandrika 08:40 AM, 15 అక్టోబర్, 2026
దివ్యాంగులకు  కేంద్రం మరింత ఆసరా

దేశంలోని పేద కుటుంబాలకు, ప్రత్యేకించి దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని (ఎన్‌ఎస్ఏపీ) పునర్‌ వ్యవస్థీకరించి, 2030-31 వరకు ఐదేళ్ల పాటు రూ.53,428 కోట్ల వ్యయంతో కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం పేరును ‘ప్రధాన మంత్రి సామాజిక సహాయతా యోజన’గా మార్చింది.

అంతేకాకుండా ఇప్పటివరకు దివ్యాంగుల పింఛను పొందడానికి ఉన్న 18 ఏళ్ల కనీస వయోపరిమితి నిబంధనను రద్దు చేసింది. దీంతో పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు పింఛను మంజూరు చేయనున్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల ప్రకారం.. వైకల్య పరిమితిని 80 నుంచి 40 శాతానికి తగ్గించడంతో పాటు ఇతర క్యాటగిరీల సంక్షేమ పథకాలతో పోలిస్తే దివ్యాంగులకు అందించే సహాయం కనీసం 25 శాతం ఎక్కువగా ఉండాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌ (పీఎల్‌బీ) కింద రూ.2009.61 కోట్ల చెల్లింపునకు ఆమోదం తెలిపింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం సామాజిక సహాయతా యోజన కింద 79 ఏళ్లలోపు వయసు వారికి నెలకు రూ.375, 80 ఏళ్లు, ఆపైబడిన వయసు వారికి నెలకు రూ.625 చొప్పున కేంద్రం తన వాటాగా అందిస్తుంది (దీనికి రాష్ట్రాలు ఇచ్చే వాటా అదనం). వృద్ధులు, వితంతువుల పింఛను పథకాలు, కుటుంబ ప్రయోజన పథకం ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొనసాగుతాయి. కేంద్ర మంత్రివర్గ తాజా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

ట్యాగ్లు
దివ్యాంగులుకేంద్రంఆసరాకేంద్ర కేబినెట్ప్రధాని మోడీకేబినెట్ నిర్ణయాలుపెన్షన్ పెంపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ
జనరల్

కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం
జనరల్

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు
జనరల్

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం
జనరల్

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..
సినిమాలు

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..
జనరల్

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం
జనరల్

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన
సినిమాలు

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!