

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు కీలక ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్, ఇజ్రాయెల్, ఇరాన్ సహా 12 దేశాల్లో పర్యటిస్తున్న లేదా నివసిస్తున్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రాంతీయ ఘర్షణలు మరింత విస్తరించే అవకాశం ఉందని, ఇరాన్‌తో పాటు దాని మిత్ర పక్షాలు అమెరికా ప్రయోజనాలను, అమెరికా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విమానాల రద్దు, గగనతల మూసివేతలు, ప్రయాణ ప్రణాళికల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది.
సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలపై హూతీ దాడుల ముప్పును కూడా అమెరికా హెచ్చరికలు ప్రస్తావించాయి. అమెరికా పౌరులు తమ ఉనికిని సాధ్యమైనంత తక్కువగా చాటుకోవాలని, రద్దీగా ఉండే ప్రాంతాలకు, అమెరికా ప్రభుత్వ లేదా వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించాయి. అయితే ఈ హెచ్చరికల అర్థం అన్ని విమానాశ్రయాలను మూసివేస్తున్నారని కాదని గమనించాలి. పరిస్థితులకు అనుగుణంగా విమాన సర్వీసులు, ప్రయాణ ఏర్పాట్లలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అధికారిక సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!