18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతితో మన మీమ్స్ గాడ్.. బ్రహ్మానందానికి ప్రత్యేక గౌరవం

Writer: Suneel Mekala 07:27 AM, 22 డిసెంబర్, 2025
రాష్ట్రపతితో మన మీమ్స్ గాడ్.. బ్రహ్మానందానికి ప్రత్యేక గౌరవం

ద్రౌపది ముర్ము  ప్రత్యేకంగా బ్రహ్మానందంను కలిశారు. గత మూడు రోజులుగా హైదరాబాద్ లో పర్యటిస్తున్న రాష్ట్రపతి, శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇతర కార్యక్రమాలకు హాజరైన ఆమె, ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం రాష్ట్రపతిని కలిసి, ఆమె చేతుల మీదుగా శాలువాతో సత్కారం పొందారు. ప్రతిగా ఆయన స్వహస్తాలతో చిత్రించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఆమెకు బహూకరించారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంతో, దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగులో తిరుగులేని నంబర్ వన్ కమెడియన్‌గా బ్రహ్మానందం ఆధిపత్యం చెలాయించారు. తరతరాల ప్రేక్షకులను ఒకేలా నవ్వించగల అరుదైన ప్రతిభతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అనేక చిత్రాల్లో హీరోలకన్నా ఎక్కువగా ప్రేక్షకులను అలరించి, ఆయా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ఇటీవల మళ్లీ సినిమాల్లో చురుకుగా కనిపిస్తూ తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. తాజాగా గుర్రం పాపిరెడ్డి చిత్రంలో జడ్జి పాత్రలో ఆయన చేసిన కామెడీకి మంచి స్పందన లభించింది. సినిమా రంగానికే కాకుండా ఇతర రంగాల్లోనూ ఆయనకు అపారమైన గౌరవం ఉంది. ఆయన ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన బ్రహ్మానందం, తీరిక వేళల్లో చిత్రకళపై ఆసక్తితో బొమ్మలు గీయడం తెలిసిందే. ప్రముఖులకు, సన్నిహితులకు తన కళాకృతులను బహుమతిగా అందించడం ఆయనకు అలవాటు. రాష్ట్రపతిని కలిసిన సందర్భంలోనూ ఈ ప్రత్యేక జ్ఞాపికను అందజేసి, తన కళాప్రతిభను మరోసారి చాటుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కూరగాయలు, పండ్లతో ప్రత్యక్షమైన అమ్మవారు.. దుర్గమాసుర సంహారం!

కూరగాయలు, పండ్లతో ప్రత్యక్షమైన అమ్మవారు.. దుర్గమాసుర సంహారం!

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..

పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..

పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..

గుంటూరు సీఐడీ కార్యాలయంలో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన..

గుంటూరు సీఐడీ కార్యాలయంలో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన..

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

ట్యాగ్లు
బ్రహ్మానందంద్రౌపది ముర్ముతెలుగు సినిమాహైదరాబాద్ వార్తలురాష్ట్రపతి కార్యక్రమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియడ్ సినిమాలకు ‘ఫౌజీ’ కొత్త ఊపునిస్తుందా?
సినిమాలు

బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియడ్ సినిమాలకు ‘ఫౌజీ’ కొత్త ఊపునిస్తుందా?

నా కెరీర్‌లో టాప్ 3 సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి: విజయ్ దేవరకొండ
సినిమాలు

నా కెరీర్‌లో టాప్ 3 సినిమాల్లో ‘రణబాలి’ ఒకటి: విజయ్ దేవరకొండ

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!
క్రీడలు

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

కూరగాయలు, పండ్లతో ప్రత్యక్షమైన అమ్మవారు.. దుర్గమాసుర సంహారం!
జనరల్

కూరగాయలు, పండ్లతో ప్రత్యక్షమైన అమ్మవారు.. దుర్గమాసుర సంహారం!

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..
జనరల్

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..

పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..
జనరల్

పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు..

గుంటూరు సీఐడీ కార్యాలయంలో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన..
జనరల్

గుంటూరు సీఐడీ కార్యాలయంలో 320 అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన..

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..
జనరల్

కోల్‌కతాలో దుర్గాపూజ మండపం వద్ద తొక్కిసలాట..

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!
జనరల్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు.. 20,018 మెగావాట్లకు చేరిక!

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!
జనరల్

శ్రీకాకుళంలో అదానీ గ్రూప్ రూ.16,000 కోట్ల టైటానియం పార్క్.. భారీగా ఉద్యోగాలు!

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు
జనరల్

దొడ్ల డెయిరీ పాలు, ప్రియాగోల్డ్ బిస్కెట్లలో కల్తీ? ఎఫ్‌ఎస్ఎస్ఏఐ కీలక చర్యలు

‘రాజాసాబ్’ తర్వాత మారుతి కొత్త సినిమా.. ఈసారి పూర్తిగా కామెడీతో!
సినిమాలు

‘రాజాసాబ్’ తర్వాత మారుతి కొత్త సినిమా.. ఈసారి పూర్తిగా కామెడీతో!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!