
గాసిప్స్

ఇస్రోలో శాస్త్రవేత్త, ఇంజినీర్ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మొత్తం 176 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్రో కేంద్రాలు, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీలో ఈ పోస్టులు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16, 2026 రాత్రి 11:55 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రో అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియలో రాత పరీక్షతో పాటు తదుపరి దశల్లో ఎంపిక ఉంటుంది. దేశ అంతరిక్ష, పరిశోధనా కార్యక్రమాల్లో నేరుగా పనిచేసే అవకాశం ఈ నియామకాల ద్వారా లభించనుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అధికారిక ఇస్రో వెబ్‌సైట్ ద్వారా అర్హతలు, నిబంధనలు పరిశీలించి నిర్ణీత గడువులో దరఖాస్తు సమర్పించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!