
సినిమాలు

గుజరాత్‌లోని రామోల్ ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో భారీ మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఫ్యాక్టరీకి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకపోవడంతో మార్చి 31న అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఫ్యాక్టరీ ఎలా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిందనే అంశంపై విచారణ కొనసాగుతోంది. పేలుడుకు గల అసలు కారణాన్ని అధికారులు దర్యాప్తు ద్వారా వెల్లడించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!