
సినిమాలు

మహారాష్ట్రలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అధికారులు తనిఖీలు చేపట్టారు. థానే, పుణె జిల్లాల్లో నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు రూ.48.09 లక్షల విలువైన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన, దెబ్బతిన్న ఆహార పదార్థాలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
అక్రమంగా ఆహార పదార్థాలను విక్రయించిన వ్యవహారంలో రిలయన్స్, బ్లింకిట్, జొమాటోకు చెందిన సిబ్బందితో పాటు సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందేలా తనిఖీలను మరింత కఠినతరం చేయడంపై అధికారులు దృష్టి సారించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!