
గాసిప్స్

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చినూర్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ట్రక్కు షీతలా మాత ఆలయంలోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న భక్తుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు వేగంగా ఆలయంలోకి దూసుకెళ్లడంతో ఈ విషాద ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ట్రక్కు అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!