

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కొమురం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా తోట ఆగయ్య మాట్లాడుతూ, ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బూర బాలు, మొగిలి నాగరాజు, ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్, అమర్ రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!