

దిల్లీలో నేడు సాయంత్రం ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృశ్యమాధ్యమం ద్వారా కూటమి నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
నవంబర్ 1న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్), కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ సభ నిర్వహించాలనే ప్రతిపాదనపై ఇండియా కూటమి నేతలు చర్చించనున్నారు. సభ నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, వివిధ పార్టీల భాగస్వామ్యం వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే సభకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!