

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌ను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత సందర్శించారు. పంపుహౌస్ వ్యూ పాయింట్ నుంచి గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నెలకొన్న నీటి సమస్యలను పరిశీలించేందుకు ఆమె పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాణహిత నీటిని మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాలని కవిత డిమాండ్ చేశారు. నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించకపోతే కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మేడిగడ్డ అంశాన్ని సాకుగా చూపి రైతులకు నష్టం చేయవద్దని కవిత అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు సమస్యల పరిష్కారానికి మార్గాలను కూడా సూచిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధితోనే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. రాజకీయాలు చేస్తూ టీవీల్లో కనిపించాలనే ఉద్దేశం తమ పార్టీకి లేదని స్పష్టం చేశారు. తాము చేసిన సూచనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!