
జనరల్

డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు ప్రారంభించాయి. విమానం కూలడానికి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఫ్లైట్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆ ప్రైవేట్ జెట్ యజమాని, గమ్యం వంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!