10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

Writer: Pooja 04:27 PM, 9 అక్టోబర్, 2026
భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

తెలంగాణ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌ వంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఫెయిర్‌-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో 16 రాష్ట్రాలు, ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటక సంస్థలు, ట్రావెల్‌ కంపెనీలు, ఆతిథ్య రంగ సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, ఉపాధి మార్గాలు ఏర్పడతాయని మంత్రి పేర్కొన్నారు.

ఈ ఫెయిర్‌ ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ కొనుగోలుదారులు, సేవలందించే సంస్థల మధ్య అనుసంధానం పెరిగి, మార్కెట్‌ విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయని జూపల్లి తెలిపారు. తెలంగాణకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా కొత్త ప్యాకేజీలను రూపొందించాలని ట్రావెల్‌ కంపెనీలను కోరారు. ఈ ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నాసిర్‌ అస్లాం వానీ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ డైరెక్టర్‌ లక్ష్మణ్‌ రంజిత్‌ నాయక్‌, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, ఫెయిర్‌ఫెస్ట్‌ ఎండీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

ట్యాగ్లు
తెలంగాణ పర్యాటకంజూపల్లి కృష్ణారావుపర్యాటక పెట్టుబడులుట్రావెల్ టూరిజం ఫెయిర్గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్హైదరాబాద్ కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో
జనరల్

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు
జనరల్

ఉద్యోగం పేరుతో మాజీ వైసీపీ కౌన్సిలర్‌పై మోసం ఆరోపణలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్
సినిమాలు

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?
క్రీడలు

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్
జనరల్

ముంబై ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌
షోస్

ఎలిమినేషన్‌ రేసులో అపూర్వ...డబుల్ ఎలిమినేషన్‌ టాక్‌

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్
సినిమాలు

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్
సినిమాలు

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష
జనరల్

అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?
సినిమాలు

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్
సినిమాలు

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!