

అమెరికన్ డ్రీమ్‌ను సాకారం చేసుకోవాలనే ఆశతో అమెరికాలో అడుగుపెట్టిన వేలాది భారతీయ కుటుంబాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కోతలు, హెచ్-1బీ వీసా నిబంధనలపై కఠినతరం, ఐ-140 పిటిషన్ల తిరస్కరణలు భారతీయ నిపుణుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు అద్దెలు, రోజువారీ ఖర్చులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. గృహ రుణాల భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇళ్లను విక్రయించడంలో ఎదురవుతున్న సమస్యలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. గతంలో అమెరికాలో అధిక వేతనాలు పొందిన కొందరు సాఫ్ట్వేర్ నిపుణులు ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో తక్కువ వేతనాలకైనా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలోని భారతీయ విద్యార్థుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. వేల డాలర్లు ఖర్చు చేసి చదువులు పూర్తి చేసినప్పటికీ, క్యాంపస్ నియామకాలు లభించక కొందరు తెలుగు విద్యార్థులు పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, డెలివరీ సేవల్లో పనిచేస్తూ జీవన ఖర్చులు, విద్యా రుణాలను భరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని గుర్తు చేస్తున్నాయని అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కుటుంబాలు పరిమిత పొదుపులతోనే భారత్‌కు తిరిగి రావాలని ఆలోచిస్తుండటంతో, అమెరికాకు వెళ్లి చదువుకోవాలని లేదా ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న వారిలోనూ ఆందోళన పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!