

సౌదీ అరేబియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ సూచించింది. స్థానికంగా పరిస్థితులను గమనిస్తూ, అధికారుల భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. ముఖ్యంగా దాడులకు సంబంధించిన ఘటనలు జరిగిన ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారతీయుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఎంబసీ జారీ చేసింది.
అదేవిధంగా, దాడులకు సంబంధించిన దృశ్యాలను, ఫొటోలు, వీడియోలను చిత్రీకరించవద్దని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసినట్లు సమాచారం. ఇటువంటి దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం కూడా నివారించాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. ప్రయాణికులు తమ విమాన సంస్థల నుంచి తాజా సమాచారాన్ని తెలుసుకుని ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలి. విమాన సర్వీసుల రద్దుకు సంబంధించిన వివరాలు, తాజా ప్రయాణ సూచనలను అధికారిక ప్రకటనల ద్వారా నిర్ధారించుకోవడం అవసరం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!