
సినిమాలు

భారతదేశ విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 72 గంటల్లో వరుసగా మూడు సార్లు అత్యధిక స్థాయి డిమాండ్ నమోదైంది. తాజా వివరాల ప్రకారం, 2026 మే 20న మధ్యాహ్నం 15:31 గంటలకు గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,65,297 మెగావాట్లకు చేరింది. అంతకుముందు మే 18న 258.1 GW, మే 19న 260.2 GW నమోదైంది.
సాయంత్రం తర్వాత పరిస్థితి మరింత కీలకంగా మారింది. రాత్రి 11 గంటలకు దేశవ్యాప్తంగా డిమాండ్ 250.9 GWగా కొనసాగగా, అర్ధరాత్రి సమయంలో కూడా సుమారు 245 GW స్థాయిలో నిలిచింది. సౌర శక్తి అందుబాటులో లేకుండా రాత్రి సమయంలో థర్మల్, హైడ్రో, విండ్ విద్యుత్ ఆధారంగా గ్రిడ్ నడుస్తోంది. అదే సమయంలో IEX డే-అహెడ్ మార్కెట్ ధరలు 21 మే డెలివరీకి ₹5,997.07/MWhగా నమోదయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!