

హైదరాబాద్ నగర పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన భూములు గుర్తించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో మూడు విడతల్లో లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. రెండో, మూడో విడతల నిర్మాణాలకు అవసరమైన భూములను కూడా ముందుగానే గుర్తించాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన వారికే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. ఎంపిక ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!