18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

Writer: Chandrika 07:36 PM, 18 అక్టోబర్, 2026
నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

హైదరాబాద్‌లో తాగునీటి దుర్వినియోగంపై జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌లో నీటిని వృథా చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోని రోడ్ నంబర్ 45, ప్లాట్ నంబర్ 872లో ఉన్న ఈ పబ్‌లో నీటి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన అనంతరం యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. అంతేకాకుండా తాగునీటి కనెక్షన్‌ను తొలగించడంతో పాటు జలమండలి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి కమర్షియల్ ట్యాంకర్ల ద్వారా అందించే నీటి సరఫరాను కూడా నిలిపివేశారు.

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వినియోగించాలని జలమండలి ప్రజలకు సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర వాణిజ్య సంస్థలు తాగునీటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది. నీటి వృథాను గుర్తిస్తే 99499 30003 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, 155313 కస్టమర్ కేర్ నంబర్‌ను కూడా సంప్రదించవచ్చని తెలిపింది. ఫిర్యాదుతో పాటు ఫొటోలు, వీడియోలు, ఘటన స్థలం, పూర్తి చిరునామా వంటి వివరాలను అందించవచ్చని, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

ట్యాగ్లు
హైదరాబాద్ జలమండలిహెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీఫోర్ ఫాదర్స్ పబ్జూబ్లీహిల్స్నీటి వృథాతాగునీటి దుర్వినియోగంరూ.20 వేల జరిమానావాటర్ కనెక్షన్ కట్హైదరాబాద్ వార్తలునీటి సంరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..
జనరల్

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు..

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!
జనరల్

నదిని కాపాడాలన్న యువకుడి ప్రయత్నానికి ఊహించని షాక్‌!

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..
టెక్నాలజీ

ఏఐ సైబర్‌ దాడులకు చెక్‌ పెట్టేలా రుబ్రిక్‌ కొత్త టూల్‌..

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..
బిజినెస్

భారత్‌లో టెస్లా రోడ్‌స్టర్‌ బుకింగ్స్‌ ప్రారంభం..

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్
బిజినెస్

ఎయిర్‌టెల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా
జనరల్

నీటి వృథాపై జలమండలి ఫైర్‌..జూబ్లీహిల్స్‌ పబ్‌కు భారీ జరిమానా

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ
జనరల్

మహాలక్ష్మి పథకం, పండుగ బస్సుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేవు: టీజీఎస్‌ఆర్టీసీ

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్
క్రీడలు

హార్దిక్ పాండ్యకు ప్రత్యామ్నాయం కోసం అతిగా ఆలోచించొద్దు: గావస్కర్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు
జనరల్

పోలవరం వద్ద మారిన గోదావరి జలాల రంగు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
రాజకీయాలు

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!