22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. నాలుగు పక్షులను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

Writer: Harika S 03:18 PM, 22 అక్టోబర్, 2026
దసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. నాలుగు పక్షులను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను ఇనుప బోనుల్లో బంధించిన ఘటనలపై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. పౌరుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మొత్తం నాలుగు పాలపిట్టలను ప్రాణాలతో కాపాడినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు. లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ సమీప ఆలయం వద్ద రెండు పాలపిట్టలను బోనుల నుంచి విడిపించారు. వాటిని కేబీఆర్ పార్క్‌కు సంబంధించిన అటవీ అధికారులకు అప్పగించారు. ఛత్రినాకలోని శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం సమీపంలో చెట్టుకు వేలాడదీసిన బోనులో ఉన్న మరో పాలపిట్టను, మంగళహాట్‌లోని బాలాజీనగర్ ఆలయం సమీపంలో బంధించిన ఇంకో పాలపిట్టను కూడా పోలీసులు రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు.

పండుగ పేరుతో మూగప్రాణులను బంధించడం, వాటి స్వేచ్ఛను హరించి డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించడం అమానవీయమని సజ్జనర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దని ప్రజలకు సూచించారు. వన్యప్రాణులకు హాని కలిగించే ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం 1800 425 5364, 9803338666 టోల్‌ఫ్రీ నంబర్లకు లేదా డయల్ 112కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. పండుగలను బాధ్యతాయుతంగా జరుపుకుంటూ పక్షులు, ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛను కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కేరళ అమ్మాయి మెరుపులు..

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

గల్ఫ్ ఆఫ్ అమెరికా తర్వాత అట్లాంటిక్‌పై ట్రంప్ కన్ను

ట్యాగ్లు
హైదరాబాద్ పోలీసులుపాలపిట్టతెలంగాణ రాష్ట్ర పక్షిసజ్జనర్దసరావన్యప్రాణుల రక్షణజంతు సంరక్షణఅటవీ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముదిరాజ్‌లకు సామాజిక న్యాయం చేస్తాం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ముదిరాజ్‌లకు సామాజిక న్యాయం చేస్తాం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
ఓటీటీ

‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ
రాజకీయాలు

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
జనరల్

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి కీలక అప్‌డేట్
గాసిప్స్

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి కీలక అప్‌డేట్

తొలిరోజే రెట్టింపైన జియో ఐపీఓ షేర్లకు డిమాండ్
బిజినెస్

తొలిరోజే రెట్టింపైన జియో ఐపీఓ షేర్లకు డిమాండ్

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు
జనరల్

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు
జనరల్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
జనరల్

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు
జనరల్

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!