

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోప్‌వే వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ వేగం అందుకుంది. వారణాసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వే మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని పర్యాటకం, ప్రజారవాణా అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మెట్రో, రైల్వే స్టేషన్ల నుంచి వాణిజ్య కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా పీపీపీ విధానంలో రోప్‌వే నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.
మొదటి దశలో గోల్కొండ కోట సమీపంలోని టూంబ్స్ ప్రాంతం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్తులో జూ పార్క్ వరకు ఏరియల్ రూట్ ద్వారా విస్తరించే అవకాశం ఉంది. అలాగే ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు కూడా రోప్‌వే సేవల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోప్‌వేలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!