26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

Writer: Chandrika 07:45 AM, 26 జులై, 2026
నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

ప్రస్తుత కాలంలో చిన్నారులు జంక్‌ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటుపడుతుండటం, చిన్న వయసులోనే ఊబకాయం సమస్యలు ఎదుర్కొంటుండటంతో కొన్ని కేఫేలు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. పిల్లలు ఇష్టపడే పిజ్జాలు, బర్గర్లను మైదాతో కాకుండా పోషక విలువలున్న మిల్లెట్లతో తయారు చేస్తూ రుచి, ఆరోగ్యాన్ని ఒకేచోట అందించే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని కేఫేల్లో చిన్నారులను ఆకట్టుకునే కార్టూన్‌ పాత్రలతో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చోటా భీమ్‌ కేఫేలో పిల్లల కోసం డ్రైఫ్రూట్స్‌, పోషక పదార్థాలతో తయారుచేసిన ‘సిగ్నేచర్‌ పవర్‌ లడ్డూలు’ అందిస్తున్నారు. దీంతోపాటు ‘హెల్దీ బెంటో బాక్స్‌’ పేరుతో పాఠశాలలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం నేరుగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆహారంతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంపైనా ఇలాంటి కేఫేలు దృష్టి సారిస్తున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో చిన్నారులే స్వయంగా వంటలు చేసేలా ‘జూనియర్‌ చెఫ్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తూ వంటను సరదాగా నేర్చుకునే జీవన నైపుణ్యంగా పరిచయం చేస్తున్నారు. ఆటలు, వర్క్‌షాప్‌లు, తోటి పిల్లలతో కలిసి చేసే కార్యక్రమాల ద్వారా డిజిటల్‌ స్క్రీన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారిలో కలిసిమెలిసి ఉండే గుణాన్ని పెంపొందించవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమకు నచ్చిన పనుల్లో నిమగ్నమయ్యేలా సౌకర్యాలు కల్పిస్తూ, పిల్లలకు పోషకాహారం, వినోదం, సృజనాత్మక కార్యక్రమాలు ఒకేచోట అందించడమే లక్ష్యమని చోటా భీమ్‌ కేఫే వ్యవస్థాపకుడు సీహెచ్‌. రాజీవ్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

అసోంలో తగ్గని వరద బీభత్సం..

అసోంలో తగ్గని వరద బీభత్సం..

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

ట్యాగ్లు
కిడ్స్ కేఫేచోటా భీమ్ కేఫేజూబ్లీహిల్స్హైదరాబాద్ కేఫేలుపిల్లల ఆరోగ్యకరమైన ఆహారంమిల్లెట్ పిజ్జామిల్లెట్ బర్గర్లుజూనియర్ చెఫ్హెల్దీ బెంటో బాక్స్చిన్నారుల పోషకాహారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్‌ సినిమాపై తమన్నా వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌
సినిమాలు

సౌత్‌ సినిమాపై తమన్నా వ్యాఖ్యలు.. సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌

జీర్ణక్రియకు ధనియాలు-జీలకర్ర పానీయం మంచిదని వైద్యుల సూచన
ఆరోగ్యం

జీర్ణక్రియకు ధనియాలు-జీలకర్ర పానీయం మంచిదని వైద్యుల సూచన

హెచ్‌సీఏ మహిళా సెలెక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సువర్ణ లక్ష్మి
క్రీడలు

హెచ్‌సీఏ మహిళా సెలెక్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సువర్ణ లక్ష్మి

అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌
క్రీడలు

అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
జనరల్

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

అసోంలో తగ్గని వరద బీభత్సం..
జనరల్

అసోంలో తగ్గని వరద బీభత్సం..

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..
జనరల్

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..
రాజకీయాలు

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..
జనరల్

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!