
షోస్

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు చట్టప్రకారం రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధించిన కేసుల వివరాలపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని సూచించింది.
అలాగే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లను జారీ చేయాలని హైకోర్టు తెలిపింది. కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!