
క్రీడలు

ఫ్రైడ్రీచ్ అటాక్సియా అనే అరుదైన నర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ యువ అభిమాని ఇంటిని నటుడు రామ్ పోతినేని సందర్శించారు. గత 18 ఏళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్న ఆ యువతి, రామ్ పోతినేనిని కలవాలని ఎంతోకాలంగా కలలు కంటున్నట్లు సమాచారం.
ఆమె భావోద్వేగ ప్రయాణాన్ని తెలుసుకున్న రామ్ పోతినేని తన బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టి ఆమె ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపిన ఆ క్షణాలు ఎంతో భావోద్వేగంగా మారాయి. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయన మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!