18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

Writer: Nithish 04:23 PM, 18 అక్టోబర్, 2026
భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉత్తర చెన్నైలోని ప్యారీస్ కార్నర్, ఎన్నూర్‌తో పాటు దక్షిణ చెన్నైలోని మీనంబాక్కం, తిరువొత్తియూర్ ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో గత 24 గంటల్లో సగటున 105 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగి, వాహనాలు నిలిచిపోయాయి. రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2023లో మిచాంగ్ తుఫాను తర్వాత నగరంలో నమోదైన భారీ వర్షపాతాల్లో ఇది ఒకటిగా నిలిచింది. తమిళనాడు మంత్రి ఆదవ్ అర్జున వెల్లడించిన వివరాల ప్రకారం, సాయంత్రం 6 గంటల నుంచి ప్యారీస్‌లో 35.8 సెంటీమీటర్లు, తిరువొత్తియూర్‌లో 31.2 సెంటీమీటర్లు, మనాలిలో 25 సెంటీమీటర్లు, ఎన్నూర్‌లో 20.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరోవైపు, ఆదివారం చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమై రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. తదుపరి వర్షాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలోని పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు

సుడిగాలి సుధీర్‌కు 2014లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందా? వైరల్‌గా మారిన పాత ఫోటోలు

మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి గడువు

మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల దాఖలుకు నేడే చివరి గడువు

ట్యాగ్లు
చెన్నై వర్షాలుభారీ వర్షాలుచెన్నై వరదలుతమిళనాడు వాతావరణంప్యారీస్ కార్నర్ఎన్నూర్తిరువొత్తియూర్మీనంబాక్కంజలమయమైన రహదారులుమున్సిపల్ అధికారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర
రాజకీయాలు

వైకాపా బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి: ధూళిపాళ్ల నరేంద్ర

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క
జనరల్

మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి సీతక్క

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు
రాజకీయాలు

నామినేషన్లు వేయకుండా మా వాళ్లను అడ్డుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ఆరోపణలు

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ
జనరల్

తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 42 ప్రోమో 2 విడుదల..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!