
బిజినెస్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని మొత్తం 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో సాధారణ జనజీవనం, రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాతావరణ తాజా సమాచారాన్ని గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీరు నిలిచిన రహదారులపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!