

శుక్రవారం ఉదయం నుంచే నల్లటి మేఘాలు తిరుమలను కమ్మేశాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉదయం మోహినీ అవతార వాహన సేవను తిలకించేందుకు వచ్చిన భక్తులు సాయంత్రం గరుడ వాహన సేవ కోసం గ్యాలరీల్లోనే ఉండిపోయారు. వర్షాన్ని లెక్కచేయకుండా తమ స్థానాల్లోనే కూర్చున్నారు. ఆ తర్వాత వర్షం తగ్గినప్పటికీ చిరుజల్లులు కొనసాగాయి.
వర్షం కారణంగా గరుడ వాహన సేవ ఘటాటోపం నీడలో నెమ్మదిగా ముందుకు సాగింది. మరోవైపు, టీటీడీ అంచనా వేసిన స్థాయిలో భక్తుల రద్దీ కనిపించలేదు. దసరా సెలవులు, పెరటాశి మాసం చివరి వారం కావడంతో భారీగా భక్తులు వస్తారని భావించిన టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం, వర్ష సూచనల నేపథ్యంలో రద్దీ తగ్గినట్లు తెలుస్తోంది. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటలకే మూసివేసే గ్యాలరీ గేట్లు తెరిచే ఉంచడం గమనార్హం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!