
సినిమాలు

హైదరాబాద్‌లో ఒక మహిళ రాపిడో రైడర్‌ను కేవలం వంద రూపాయల కోసం వేధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైడ్ పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా, రైడర్‌పై బూతులతో విరుచుకుపడినట్లు సమాచారం. అంతేకాకుండా, డబ్బులు అడిగితే వేధింపుల కేసు పెడతానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిస్థితిని భరించలేక రైడర్ తన మొబైల్‌లో ఈ ఘటనను రికార్డ్ చేశాడు. మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, రైడర్ ఆమెను ఆపి పోలీస్ స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆ మహిళ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!