

పుంగనూరు సమీపంలోని ప్రసిద్ధ శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి, నవగ్రహ, చండీ హోమాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది.
అమ్మవారి అలంకార సేవలో పాల్గొన్న ఉభయదారులను ఆలయ ఈవో, సహాయ కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. వారికి ఆలయ మర్యాదలతో పాటు అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!