
జనరల్

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ మరియు సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులు తమ కుటుంబంలోకి నాలుగో బిడ్డను ఆహ్వానించారు. తమ కుమారుడికి అలెక్ నీల్ అని పేరు పెట్టినట్లు జె.డి. వాన్స్ ప్రకటించారు. ఈ శుభవార్తపై పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ జననం అమెరికా రాజకీయ చరిత్రలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 150 సంవత్సరాల తర్వాత, పదవిలో కొనసాగుతున్న అమెరికా ఉపాధ్యక్షుడికి బిడ్డ జన్మించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1870లో విధుల్లో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడికి సంతానం కలిగినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. జె.డి. వాన్స్, ఉషా వాన్స్ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!