
సినిమాలు

మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. గురువారం ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ పనులను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
స్కిల్ యూనివర్సిటీ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. అలాగే ఎఫ్‌సీడీఏ కార్యాలయం నగర అభివృద్ధి పనులకు వేగం చేకూర్చుతుందని చెప్పారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!