
రాజకీయాలు

కాకినాడ జిల్లాలో గురువారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం నుంచి సుమారు 40 మంది భవానీ భక్తులు ప్రైవేట్ బస్సులో విజయవాడకు బయలుదేరారు. మార్గమధ్యలో బస్సు మరమ్మతుకు గురికావడంతో డ్రైవర్ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి సమీపంలో రోడ్డుపక్కన నిలిపివేశారు.

టీ తాగేందుకు బస్సు దిగిన భక్తులు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో భక్తుడు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భక్తుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!