
రాజకీయాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయనకు కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యనమల కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి ఆరోగ్యంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
యనమల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ సానా సతీశ్ ఆస్పత్రికి చేరుకుని యనమల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. వైద్యుల నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!