
సినిమాలు

హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా చౌరస్తా SVK కాంప్లెక్స్‌లో ఉన్న ఓ వస్త్ర దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో ఉన్న భారీ బట్టల స్టాక్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాతబస్తీలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో భద్రతా ప్రమాణాలపై మళ్లీ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!