7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

Writer: Nithish 11:26 AM, 7 సెప్టెంబర్, 2026
చంద్రబాబు జల ప్రస్థానానికి ఈటీ ప్రశంసలు

లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ‘సీఈఓ సీఎం టూ వాటర్‌మ్యాన్’ కథనాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ మంత్రి నిమ్మల రామానాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి ఊతమిచ్చి యువతకు ప్రపంచ స్థాయిలో అవకాశాలు కల్పించిన చంద్రబాబు.. అనంతరం సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించి ‘వాటర్‌మ్యాన్’గా గుర్తింపు పొందారని తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం, వెలిగొండతో పాటు పలు ప్రాజెక్టులను చేపట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాలకు నీటిని అందించే చర్యలు చేపట్టారని తెలిపారు. పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతానికి, హంద్రీ-నీవా ద్వారా రాయలసీమకు నీటిని తరలించిన విషయాన్ని ఈటీ తన కథనంలో ప్రస్తావించిందని మంత్రి వివరించారు.

ఏపీలో సుమారు నాలుగు కోట్ల ఎకరాల భూమి ఉండగా, రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తీసుకురావాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే మార్గమని చంద్రబాబు విధానంగా పెట్టుకున్నారని ఈటీ పేర్కొందని నిమ్మల తెలిపారు. 2019 తర్వాత సాగునీటి రంగం దెబ్బతిన్నదని, మూడు దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో చంద్రబాబు కృషిని ఈటీ ప్రశంసించిందని చెప్పారు. ఉత్తరాంధ్రకు నీరందించేలా పోలవరం ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసి గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లడం, 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యం, వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ప్రణాళికలను కూడా కథనం ప్రశంసించిందన్నారు. భూగర్భ జలాల పెంపునకు ‘జలధార’ వంటి కార్యక్రమాలపై సీఎం దృష్టి సారించారని తెలిపారు. ఈ తీర్మానానికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

సమర్థ నాయకత్వంతోనే సమస్యలకు పరిష్కారం: సీఎం చంద్రబాబు

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

హార్దిక్ పాండ్యాతో డేటింగ్‌ రూమర్స్‌పై అమీషా పటేల్ ఘాటు స్పందన...

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

శ్రీకాకుళం హైవేపై ప్రమాదకర మలుపులు.. 35 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. యుద్ధ నిధుల కోసం ఉక్రెయిన్ కొత్త ప్లాన్

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత...

ట్యాగ్లు
చంద్రబాబునిమ్మల రామానాయుడుఆంధ్రప్రదేశ్సాగునీటి ప్రాజెక్టులుపోలవరంవెలిగొండ ప్రాజెక్టుజల వనరులుఎకనామిక్ టైమ్స్ఉత్తరాంధ్రరాయలసీమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!