

తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ విశాఖపట్నానికి సుమారు 860 కిలోమీటర్లు, కాకినాడకు 950 కిలోమీటర్లు, బాపట్లకు 1,130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. నేడు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉండగా, రేపు తుఫాన్‌గా మారవచ్చని అంచనా వేస్తున్నారు. తుఫాన్‌గా మారిన తర్వాత దీనికి అర్నాబ్ అనే పేరు పెట్టనున్నట్లు పేర్కొంటున్నారు.
ఎల్లుండి ఉదయం నాటికి ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని, బుధవారం యానాం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు సమాచారం. తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ప్రజలు భారత వాతావరణ శాఖ, స్థానిక అధికారులు జారీ చేసే తాజా హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!