

తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నట్లు సమాచారం.
ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు, రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని, తదుపరి అధికారిక సూచనలను పాటించాలని కోరింది. తుపాను దిశ, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున తాజా వాతావరణ హెచ్చరికలను గమనించడం ముఖ్యం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!