

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. దేశం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్తగా, అపారమైన మేధాశక్తికి ప్రతీకగా, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా, యువతకు స్ఫూర్తిప్రదాతగా కలాం నిలిచారని కొనియాడారు. ఆయన జీవితం, ఆలోచనలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
భారత రక్షణ రంగం, అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధికి డాక్టర్ కలాం అందించిన విశేష సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయండి” అనే కలాం సందేశం నేటికీ కోట్లాది మంది యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. యువత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలనే సందేశాన్ని కలాం జీవితం అందిస్తోందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!