

తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అనేక విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని సీఎం ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. మూసీ నదిపై మూసారాంబాగ్ వద్ద నిర్మించిన కొత్త హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని క్రమంగా గాడిలోకి తీసుకొచ్చామని చెప్పారు. 2024 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాల్లో రూ.6 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల్లో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

రైతు సంక్షేమం కోసం భారీగా నిధులు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో 27.50 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య రంగంలో 2 వేల పడకలతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ TIMS ఆసుపత్రులకు ప్రముఖ తెలంగాణ నాయకుల పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించామని, దాదాపు శతాబ్దం తర్వాత కులగణన నిర్వహించామని పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిని మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని వివరించారు. ORRలోపు కోర్ అర్బన్ రీజియన్, ORR నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య పెరీ అర్బన్ రీజియన్, RRR అవతల రూరల్ అగ్రికల్చర్ రీజియన్‌గా విభజించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించి ప్రభుత్వానికి అండగా నిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!